కరోనా: యూపీ పోలీసులకు ఆరోగ్య బీమా

లక్నో: కరోనా నివారణ చర్యల్లో వైద్య సిబ్బందితో పాటు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసులకు రూ. 50 లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పించనున్నట్టు బుధవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులను త్వరలోనే వెలువరిస్తామని యూపీ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి అవనిష్‌ అవస్థి ట్విటర్‌లో పేర్కొన్నారు. (ట్రంప్‌ బెదిరించారు.. మీరు ఇచ్చేశారు)




మీడియా ప్రతినిధులు కచ్చితంగా ముఖానికి మాస్క్‌లు ధరించాలని కోరారు. మాస్క్‌లు ధరించకపోతే వారిని పోలీసులు ఆపుతారని చెప్పారు. సోషల్‌ మీడియాలో కరోనాపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి రూ. 50లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పిస్తామని ఇంతకుముందే పంజాబ్‌ ప్రభుత్వం ప్రకటించింది.